ప్రజా గళంతో చరిత్ర సృష్టిస్తాం
జనసేన నేత నాదెండ్ల మనోహర్
అమరావతి – ఏపీలో జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే జన గళం సభతో చరిత్ర సృష్టించ బోతున్నామని జోష్యం చెప్పారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి దుమ్ము రేపడం ఖాయమన్నారు. తమకు కనీసం 150కి పైగా సీట్లు రాక తప్పదన్నారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి సాగిస్తున్న రాచరిక పాలనను ఈసడించు కుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాగళం సభను నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించ బోతున్నామని తెలిపారు నాదెండ్ల మనోహర్. సభ ఏర్పాట్లను పరిశీలించారు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడుతో కలిసి పర్యవేక్షించారు.
తాము అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి పాలన సాగిస్తుందని చెప్పారు నాదెండ్ల మనోహర్. రాష్ట్రానికి త్వరలో మంచి రోజులు రానున్నాయని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.