NEWSANDHRA PRADESH

పెయిడ్ ఆర్టిక‌ల్స్ పై ఈసీ నిఘా

Share it with your family & friends

ఎన్నిక‌ల అధికారి ముఖేష్ కుమార్ మీనా

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌చార మాధ్య‌మాల్లోని పెయిడ్ ఆర్టిక‌ల్స్ పై గ‌ట్టి నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఎన్నిక‌ల అధికారి మీడియాతో మాట్లాడారు. తాజా మార్గదర్శకాలపై ప్రచార మాధ్యమాలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని స్ప‌ష్టం చేశారు మీనా.

ప్రచార మాధ్యమాల్లో ప్రచురించే, ప్రసారం అయ్యే పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా ఉంటుందని హెచ్చ‌రించారు. ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు ఎంతో అప్ర‌మ‌త్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోరారు.

ఎన్నిక‌ల‌ సమయంలో ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విదానాలపై భారత ఎన్నికల సంఘం జారీ చేసిన భారత ఉన్నత న్యాయ స్థానం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీడియా మాధ్యమాలు, మీడియా ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు ఆయన అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మీడియా వర్కుషాపు జరిగింది.

ఈ సందర్బంగా ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అనుగుణంగా అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు.

పెయిడ్ న్యూస్ అంశాన్ని ఆయన వివరిస్తూ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని సునిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. నిర్థేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్ ను గణించి, ఆ వ్యయాన్ని సంబందిత అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి లోక్ సభ అభ్యర్థి రూ. 95 లక్షలు, శాసన సభ అభ్యర్థి రూ .40 లక్షల మేర ఖ‌ర్చు చేసేందుకు అమమతి ఉందన్నారు.