హెటిరో గ్రూప్ రూ. 60 కోట్లు విరాళం
ఈడీ కేసు ఎదుర్కొంటున్న పార్థసారథి రెడ్డి
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలంతా కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరు డబ్బులు ఇస్తే వారికి సీట్లు కేసీఆర్ ఇచ్చారనే విమర్శలున్నాయి. ఈడీ కేసు ఎదుర్కొంటున్న హెటిరో గ్రూప్ కంపెనీస్ చైర్మన్ పార్థ సారథి రెడ్డికి పనిగట్టుకుని రాజ్యసభ సీటు ఇచ్చారు.
ఈ దేశంలో అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. ఈ తరుణంలో కరోనా సమయంలో ఫార్మా కంపెనీలు ప్రజలను జలగల్లా పీల్చాయి. భారీ ధరలకు మందులను అమ్ముతూ కోట్లు గడించాయి.
ఈ సమయంలో ఎంపీగా ఉన్న పార్థసారథి రెడ్డి తన కంపెనీ తరపున ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ. 60 కోట్లు విరాళంగా ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మరో వైపు మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు , ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం బీఆర్ఎస్ అంటేనే జనం జంకుతున్నారు. నేతలు పారి పోతున్నట్లు సమాచారం.
విచిత్రం ఏమిటంటే ఐటీ జరిపిన దాడుల్లో హెటిరో లెక్కలు లేని నగదు రూ. 500 కోట్లు పట్టుపడటం తీవ్ర కలకలం రేపింది. మొత్తంగా అక్రమార్కులకు అడ్డాగా మారింది బీఆర్ఎస్ అనేది తేలి పోయింది.