జంపింగ్ ఆలోచనలో దానం
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ
హైదరాబాద్ – తెలంగాణలో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. నిన్నటి దాకా బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఓ వైపు తనకు మోదీ, షా అంటే ఇష్టం అని చెబుతూనే ఇంకో వైపు రేవంత్ రెడ్డి తనను పార్టీలో చేరమన్నాడని చెప్పారు. ఆ వెంటనే ఆయన సీఎం , రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్సీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జితేందర్ రెడ్డితో పాటు తనయుడు మిథున్ రెడ్డి కూడా జంప్ అయ్యారు.
ఇది పక్కన పెడితే భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఆయన ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ పట్ల రేవంత్ సర్కార్ అద్భుతంగా పని చేస్తోందని కితాబు ఇచ్చారు.
అధికారంలో లేక పోయే సరికి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలంతా జంపింగ్ జపాంగ్ లు గా మారి పోయారు. ఇప్పటికే పలువురు పక్క చూపులు చూస్తున్నారు.