NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ నేను రాజ‌కీయాల్లో హీరోని

Share it with your family & friends

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కామెంట్

అమ‌రావ‌తి – ప్ర‌ముఖ కాపు నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వన్ క‌ళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. త‌న జోళికి వ‌స్తే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. తాజాగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.

ఈ సంద‌ర్బంగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంపై సెటైర్లు వేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. దీనిపై తీవ్రంగా స్పందించారు ముద్ర‌గ‌డ‌. నువ్వు సినిమాల‌లో హీరో అయితే తాను నిజ జీవితంలో, రాజ‌కీయాల్లో సిస‌లైన హీరోనంటూ స్ప‌ష్టం చేశారు. ఇంకోసారి అనుచిత కామెంట్స్ చేస్తూ కాపు ప్ర‌జ‌లు త‌గిన రీతిలో స‌మాధానం చెప్ప‌డం త‌ప్ప‌ద‌న్నారు.

ఎవ‌రు రాజ‌కీయాల‌ను అడ్డం పెట్టుకుని ప‌బ్బం గ‌డుపుతున్నారో జ‌నాల‌కు తెలుస‌న్నారు ముద్ర‌గ‌డ పద్మ‌నాభం. తాను పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేసేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించారు. ఏమీ ఆశించ‌కుండానే పార్టీలో చేర‌డం జ‌రిగింద‌న్నారు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.