భట్టిని అవమానించిన కాంగ్రెస్
నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
తెలంగాణ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఆయన తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు యాదాద్రి ఆలయం సాక్షిగా అవమానానికి గురయ్యాడని ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు ప్రధాని.
విజయ్ సంకల్ప్ యాత్రలో భాగంగా తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు నరేంద్ర మోదీ. కావాలని భట్టి విక్రమార్కను అవమానించిందంటూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కావాలని దళితులను కాంగ్రెస్ చిన్న చూపు చూస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రిలో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. కాంగ్రెస్ అగ్ర కులానికి చెందిన వారికి పెద్ద పీట వేస్తూ , కింది కులాలను కావాలని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పార్టీలో అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తుందన్నారు. కానీ కాంగ్రెస్ కుటుంబంలోనే అవమానించడం పనిగా పెట్టుకుందని ఆరోపించారు ప్రధానమంత్రి.