NEWSTELANGANA

క‌విత‌కు షాక్ క‌స్ట‌డీకి ఆదేశం

Share it with your family & friends

మార్చి 23 వ‌ర‌కు రిమాండ్

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆమెను అరెస్ట్ చేసిన ఈడీ కీల‌క‌మైన ఆధారాల‌ను న్యూఢిల్లీ లోని రాస్ ఎవెన్యూ కోర్టులో స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. క‌విత అనుకున్నంత అమాయ‌కురాలు కాద‌ని, అసాధ్యురాల‌ని ఆరోపించింది.

కీల‌క‌మైన డేటాను బ‌య‌ట‌కు పొక్క‌కుండా ఉండేందుకు అత్యాధునిక టెక్నాల‌జీని వాడింద‌ని తెలిపింది. తంతే కాదు సౌత్ గ్రూప్ పేరుతో అన్నీ తానై న‌డిపంద‌ని పేర్కొంది. లిక్క‌ర్ పాల‌సీని రూపొందించ‌డంలో కీల‌క పాత్ర పోషించింద‌ని, ఏకంగా రూ. 100 కోట్లు చేతులు మారాయ‌ని, రామ‌చంద్ర‌న్ పిళ్లైని ముందు పెట్టి వెనుక నుంచి ఎవ‌రికీ చిక్క కూడ‌ద‌నే ప‌క్కా ప్లాన్ తో ఇదంతా చేసింద‌ని ఆరోపించింది.

లిక్క‌ర్ దందాలో, స్కామ్ లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ప్ర‌ధాన పాత్ర ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. ఆమె నుంచి ఇంకా కీల‌క‌మైన స‌మాచారం రాబట్టాల్సి ఉంద‌ని, అందుకే రూల్స్ కు క‌ట్టుబ‌డే అరెస్ట్ చేయాల్సి వ‌చ్చింద‌ని వెల్ల‌డించింది. దీంతో వాద‌న‌లు విన్న కోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. 10 రోజులు కాకుండా 7 రోజుల పాటు క‌స్ట‌డీకి ఇస్తూ తీర్పు చెప్పింది.