కవిత భర్త అనిల్ కు నోటీసు
జారీ చేసిన ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
న్యూఢిల్లీ – కేంద్ర దర్యాప్తు సంస్థ కోలుకోలేని షాక్ ఇచ్చింది. నిన్నటి దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగుతూ, కోట్లాది రూపాయలు వెనకేసుకుంటూ వచ్చిన కల్వకుంట్ల కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. సంచలన ఆరోపణలు చేసింది. పూర్తి స్థాయి ఆధారాలతో కోర్టుకు సమర్పించింది. ఆమె మామూలు మహిళ కాదని, పక్కా ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నం చేసిందంటూ ఆరోపించింది. అందుకే ఆమెను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో కోర్టు ఓకే చెప్పింది. 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది.
ఇదే సమయంలో ఈడీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత భర్త అనిల్ కుమార్ కు కూడా ప్రమేయం ఉందంటూ నోటీసు జారీ చేసింది. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. లేక పోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆయనతో పాటు కవిత పీఆర్ఓకు కూడా నోటీసు ఇచ్చింది.