దేశమంతటా ఎన్నికల కోడ్
మోగిన ఎన్నికల నగారా
న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో మొత్తం ఈసారి జరిగే ఎన్నికల్లో 98 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు 1.8 కోట్ల మంది ఓటు వేయనున్నట్లు తెలిపారు. వికలాంగులు, ట్రాన్స్ జెండర్లకు కూడా ఓటు వేసే ఛాన్స్ ఉందన్నారు. ఈసారి ఇంటి వద్దకే కోరిన మీదట వృద్దులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు సీఈసీ.
ఇదిలా ఉండగా దేశంలో లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ , అరుణల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ చేసినట్లు స్పష్టం చేశారు సీఈసీ.