NEWSANDHRA PRADESH

అభ్య‌ర్థుల ఎంపిక‌లో సామాజిక న్యాయం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ

ఇడుపుల‌పాయ – ఏపీలో వైసీపీ బాస్ , సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు 175 శాస‌న సభ స్థానాల‌తో పాటు 25 లోక్ స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు ఒక్క అన‌కాప‌ల్లి త‌ప్ప మిగ‌తా 199 స్థానాల‌కు అభ్య‌ర్థుల జాబితాల‌ను వెల్ల‌డించారు. మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ తామేన‌ని అన్నారు.

అసెంబ్లీ, లోక్ స‌భ‌కు సంబంధించి మొత్తం 200 సీట్లు ఉంటే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశామ‌ని చెప్పారు. దేవుడి దయతో సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చేసి చూపించామ‌న్నారు.

ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం త‌ద‌న్నారు. నామినేషన్‌ పదవుల్లోనూ, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ ప్రాధాన్య‌త క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని అన్నారు జ‌గ‌న్ రెడ్డి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో క‌నీవిని ఎరుగ‌ని రీతిలో సామాజిక న్యాయం పాటించిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హిళా మణుల‌కు పెద్ద‌పీట వేశామ‌ని చెప్పారు సీఎం.