తిరుమలలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్
భక్తుల , ఆలయ భద్రతపై ఫోకస్
తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆక్టోపస్ దళం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపించారు.
ఆక్టోపస్ దళాలు రాష్ట్రం లోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆక్టోపస్ ఎస్పీ నాగేంద్రబాబు పర్యవేక్షణలో అదనపు ఎస్పీ నగేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేపట్టారు.
ఉగ్ర దాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా , భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.
ఈ ఆపరేషన్ లో తిరుమల విజిలెన్స్ ఆఫీసర్ నంద కిషోర్, డి.ఎస్.పి శ్రీనివాస ఆచారి, ఏవిఎస్ఓలు, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆక్టోపస్ దళాన్ని ప్రత్యేకంగా అభినందించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈవో ఏవీ ధర్మా రెడ్డి.