నిప్పులు చెరిగిన రేవంత్
పవన్ బాబు జగన్ ఒక్కటే
విశాఖపట్టణం – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీలోని విశాఖలో జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో జనం హాజరయ్యారు. సభ సక్సెస్ కావడంతో జోష్ పెరిగింది ఆ పార్టీలో.
ఈ సందర్బంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో కలిసి రేవంత్ రెడ్డి ప్రజలకు అభివాదం చేశారు ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన బేకార్ అంటూ ఎద్దేవా చేశారు. రాచరిక పాలనకు చరమ గీతం పాడాలంటూ పిలుపునిచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆరు నూరైనా సరే ఎన్ని ఆందోళనలు చేసైనా అడ్డుకుని తీరుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వైఎస్ షర్మిలా రెడ్డి.