NEWSTELANGANA

ప‌డగొడితే తొడ కొడ‌తాం

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

హైద‌రాబాద్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న బీజేపీ, బీఆర్ఎస్ నాయ‌కుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప‌దే ప‌దే త‌న స‌ర్కార్ ను ప‌డ‌గొడ‌తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న వారి తోలు తీస్తామ‌ని హెచ్చ‌రించారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నామ‌ని చెప్పారు. సీఎం మీడియాతో మాట్లాడారు. ఒక‌వేళ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన చెస్తే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో త‌మ‌ దగ్గర ప్రణాళిక ఉందన్నారు.

వంద రోజుల పరిపాలన త‌న‌కు పూర్తి సంతృప్తినిచ్చిందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ వంద రోజుల్లో ప్రతి నిమిషం ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేసేందుకు ప్ర‌య‌త్నం చేశామ‌న్నారు. గత పాలన చిక్కు ముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు.

ముందు ముందు ఇంకా బాధ్యతతో అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తామ‌ని తెలిపారు. వంద రోజుల పాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనట్టు భావించడం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఒక‍్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామ‌న్నారు.

అక్రమాలకు పాల్పడిన వారికి మినహాయింపులు అంటూ ఏవీ ఉండ‌వ‌న్నారు సీఎం. చట్ట పరిధిలో విచారించి చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రతి విచారణకు ఒక పద్ధతి అంటూ ఉంటుంద‌న్నారు.

సమస్యలు చెప్పుకుంటే వినడానికి ప్రభుత్వం ఉంద‌న్న భ‌రోసాను క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని అన్నారు రేవంత్ రెడ్డి.