NEWSANDHRA PRADESH

విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు

Share it with your family & friends

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల

విశాఖ‌ప‌ట్ట‌ణం – ఆరు నూరైనా స‌రే విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌ర‌ణ కాకుండా అడ్డుకుని తీరుతామ‌ని హెచ్చ‌రించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైజాగ్‌లో జరిగిన భారీ బహిరంగసభకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి, కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింద‌న్నారు. విశాఖ ఉక్కు ఇందిరమ్మ నెలకొల్పిన పరిశ్రమ. అప్పుడు నష్టాల్లో ఉంటే నిధులు ఇచ్చి మరీ కాంగ్రెస్ పార్టీ ఆదుకుందన్నారు.

వైఎస్సార్ హయాంలో విశాఖ కోసం ఎంతో చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ బతికి ఉంటే విశాఖ ఉక్కుకు సొంత మైన్ ఉండేద‌న్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు విశాఖ ఉక్కును దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

అప్పుల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిప‌డ్డారు వైఎస్ ష‌ర్మిల‌. ఇక్కడ గంగవరం పోర్టును జగనన్న కేవలం 600 కోట్ల రూపాయలకు అమ్మేశాడని మండిప‌డ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క ఉద్యమైనా చేయలేదని ఎద్దేవా చేశారు.

అటు చంద్రబాబు ఏమో తన రాజకీయ స్వలాభం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌, బాబు ఇద్దరూ మోదీ దగ్గర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి వాళ్లను గెలిపించడం అవసరమా అని ప్ర‌శ్నించారు. ఆలోచించి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయండని పిలుపునిచ్చారు వైఎస్ ష‌ర్మిల‌.