NEWSTELANGANA

క‌విత విచార‌ణ‌లో షాకింగ్ అంశాలు

Share it with your family & friends

తొలి రోజు విచార‌ణ పూర్తి

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో కీల‌క‌మైన నిందితురాలిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌స్తుతం విచార‌ణ‌ను ఎదుర్కొంటోంది. కేసుకు సంబంధించి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందస్తు స‌మాచారం ఇచ్చి క‌విత‌ను అదుపులోకి తీసుకుంది. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది.

టాన్సిట్ ఆర్డ‌ర్ ఇవ్వ‌కుండా ఎలా త‌న సోద‌రిని అరెస్ట్ చేస్తారంటూ వాగ్వాదానికి దిగారు మాజీ మంత్రి కేటీఆర్. దీంతో దీనిని సీరియ‌స్ గా తీసుకుంది ఈడీ. కేటీఆర్ పై సీరియ‌స్ అయ్యింది. హైద‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేశారు.

ఇదే స‌మ‌యంలో క‌విత‌ను స్పెష‌ల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకు వెళ్లారు క‌విత‌ను. అక్క‌డ రాస్ అవెన్యూ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు క‌విత‌కు 7 రోజుల క‌స్ట‌డీ విధించింది. తొలి రోజు విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా విచార‌ణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. విచార‌ణ అనంత‌రం భ‌ర్త అనిల్ కుమార్ , సోద‌రుడు కేటీఆర్ , లాయ‌ర్ మోహిత్ రావు ఉన్నారు. అరెస్ట్ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ క‌విత త‌ర‌పున పిటిష‌న్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.