NEWSANDHRA PRADESH

మోదీకి చంద్ర‌బాబు థ్యాంక్స్

Share it with your family & friends

క‌లుపుకున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ప్ర‌జా గ‌ళం పేరుతో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా గ‌ళం పేరుతో భారీ బ‌హిరంగ స‌భ జ‌రిగింది. ఈ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ స‌ర్కార్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. జ‌గ‌న్ రెడ్డిని ఇంటికి పంపించాల‌ని పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. నిన్న‌టి దాకా ప్ర‌ధాన మంత్రి మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌ను అన‌రాని మాట‌లు అన్నారు చంద్ర‌బాబు నాయుడు. ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నారు. జ‌గ‌న్ రెడ్డి దెబ్బ‌కు ఏపీ స్కిల్ స్కామ్ కేసులో ఇరుక్కున్నారు. ఆపై 53 రోజుల పాటు రాజ‌మండ్రి జైలులో ఉన్నారు.

ఆ త‌ర్వాత త‌ను ఒంట‌రిగా పోరాడ‌లేన‌ని గ్ర‌హించారు. దీంతో యూ ట‌ర్న్ తీసుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు బీజేపీతో బంధం తిరిగి క‌లుపుకున్నారు. స‌భా వేదిక‌గా చంద్ర‌బాబు నాయుడు మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు.