జగన్ ..బాబును ఆడిస్తున్న మోదీ
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ సీఎం జగన్ రెడ్డిని మరో వైపు చంద్రబాబు నాయుడును ఆడిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు ఏపీ సీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజా గళం పేరుతో ఏర్పాటు చేసిన సభ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకే సరి పోయిందని ఎద్దేవా చేశారు.
ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు. రెండు పంజరాల్లో బంధించి తను చెప్పినట్టు ఆడేలా చేశాడంటూ మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
వైసీపీ బాస్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైస్ షర్మిల ఒక్కటేనంటూ ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అలా అయితే తాను ఏపీ పీసీసీ చీఫ్ ఎందుకు అవుతానంటూ నిలదీశారు. తాను ప్రజల కోసం పని చేస్తున్నానే తప్పా పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మోదీ ఇలాంటి చవకబారు ప్రకటనలు చేయడం దారుణమన్నారు.