DEVOTIONAL

శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్లు పెంపు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన తిరుమ‌ల దేవ‌స్థానం

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) శుభ వార్త చెప్పింది. ఈ మేర‌కు భ‌క్త బాంధ‌వుల‌కు తీపి క‌బురు అందించింది. ఆర్జిత‌, ఇత‌ర సేవలకు సంబంధించి జూన్ నెల కోటాకు గాను టికెట్ల‌ను విడుద‌ల చేసింది.

జూన్ నెల‌కు సంబంధించి శ్రీ‌నివాసుడి ద‌ర్శ‌నానికి సంబంధించి కోటాను విడుద‌ల చేసింది. అయితే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేయ‌డంతో టీటీడీ పాల‌క‌మండ‌లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

అదేమిటంటే ఎలాంటి సిఫార‌సు లేఖ‌ల‌ను తాము స్వీక‌రించే ప్ర‌సక్తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. వాటిని ర‌ద్దు చేసిన‌ట్లు పేర్కొంది. అయితే వీఐపీలు, వీవీఐపీలు ప్రోటోకాల్ క‌లిగిన వారు వ‌స్తే రూల్స్ ప్ర‌కారం వారికి మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం సౌక‌ర్యం క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

తాజాగా మ‌రో కీల‌క అప్ డేట్ ఇచ్చారు ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి. శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కోటాను పెంచిన‌ట్లు చెప్పారు. ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని కోరారు.