ఏపీ జనం కూటమిపై నమ్మకం
విజయం సాధించడం ఖాయం
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా గళం పేరుతో నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ విజయవంతం చేశారని అన్నారు. సోమవారం సభ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజలు డిసైడ్ అయ్యారని జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకని చెప్పారు.
రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాచరిక పాలన సాగుతోందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల, కేంద్రంలోని సుస్థిరమైన పాలన పట్ల మరింత నమ్మకాన్ని కనబరుస్తున్నారని ఆ విషయంలో అశేష జన వాహినిని చూస్తే అర్థమవుతుందని అన్నారు పవన్ కళ్యాణ్.
ప్రజలు ఇప్పుడు ఎన్ని చెప్పినా, ఎన్ని తాయిలాలు ఇచ్చినా వినిపించుకునే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఏపీలో ఎన్డీయే పునః కలయిక 5 కోట్ల ప్రజల ఆశలు మరింత పెంచేలా చేసిందని చెప్పారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా పొత్తు మొదలైందని , 2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు పురుడు పోసుకుందని పేర్కొన్నారు.
అభివృద్దికి నోచుకోక ఏపీ అప్పులతో నలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.