NEWSNATIONAL

ఇండియా కూట‌మిదే విజ‌యం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ప్ర‌తిపక్షాలు

మ‌హారాష్ట్ర – దేశంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. బీహార్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎంలు నితీశ్ కుమార్ , లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ లు ఇండియా కూట‌మికి ఝ‌ల‌క్ ఇచ్చినా ఎక్క‌డా వెనుదిరిగి చూడ‌లేదు కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో న్యాయ్ యాత్ర 10,000 కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది.

ఈ సంద‌ర్బంగా మహారాష్ట్రలో ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో న్యాయం, హ‌క్కులు, స‌మాన‌త్వం కోసం 6,700 కిలోమీట‌ర్ల మేర సుదీర్ఘ న్యాయ్ యాత్ర పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టారు. ముంబై పౌరుల భారీ మ‌ద్ద‌తుతో చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

ఈ యాత్ర‌లో భాగంగా రాహుల్ గాంధీ ప‌ది వేల కిలోమీట‌ర్లు యాత్ర చేప‌ట్ట‌డం విశేషం. దేశంలోని యువ‌త‌, రైతులు, మ‌హిళ‌లు, బాధితులు, అట్ట‌డుగు వ‌ర్గాల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు విన్నారు. మోదీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

గత 10 ఏళ్ల మోదీ ప్రభుత్వ దుష్పరిపాలనలో సమాజంలోని ప్రతి వర్గానికి అన్యాయం జ‌రిగింద‌ని ఆవేద‌న చెందారు ఇండియా కూట‌మి నేత‌లు. త‌మ కూట‌మి రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.