లోక్ సభ ఎన్నికల్లో తమిళి సై పోటీ
గవర్నర్, ఎల్జీ పదవులకు రాజీనామా
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు నిన్నటి దాకా ఒక వెలుగు వెలిగిన , అహంకార పూరితంగా వ్యవహరించి చివరకు అధికారాన్ని కోల్పోయిన మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి జంపింగ్ జపాంగ్ లు ఎక్కువయ్యారు. ఇదే సమయంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఉన్నట్టుండి రాష్ట్ర గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం విస్తు పోయేలా చేసింది.
ఈ మేరకు సోమవారం ఆమె కీలక ప్రకటన చేయడంతో కలకలం రేపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమిళనాడుకు చెందిన నరసింహన్ రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ గా కొలువు తీరారు తమిళి సై సౌందర రాజన్. మొదట్లో కేసీఆర్ తో బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య అగాధం పెరిగింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకునేంత దాకా వెళ్లింది.
అనుకోకుండా ప్రభుత్వం మారింది. ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. సీఎం రేవంత్ రెడ్డి తమిళి సై మధ్య సత్ సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈ తరుణంలో ఉన్నట్టుండి ఆమె రాజీనామా చేయడంతో ఒకింత ఇబ్బంది ఏర్పడింది. ఆమె తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం.