బీఆర్ఎస్ కు రూ.1,322 కోట్ల బాండ్లు
ప్రాంతీయ పార్టీలలో నెంబర్ వన్
హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘానికి భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలలో దిమ్మ తిరిగేలా వాస్తవాలు వెలుగు చూశాయి. ఇప్పటికే నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి ఏకంగా రూ.6,000 కోట్ల రూపాయలు కేవలం బాండ్ల రూపంలో సమకూరాయి. ఈ విషయం ఈసీ వెబ్ సైట్ లో వెల్లడించింది.
నిన్నటి దాకా వివరాలు వెల్లడించేందుకు ససేమిరా ఒప్పుకోని ఎస్బీఐ చివరకు సుప్రీంకోర్టు దెబ్బకు దిగి వచ్చింది. ఈ దేశంలో ప్రతిదీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని , ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంది.
ఇక నిన్నటి దాకా చిలుక పలుకులు పలికన , బంగారు తెలంగాణ పేరుతో నిలువు దోపిడీ చేసిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా రూ. 1,322 కోట్లు కేవలం ఎలోక్టరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీల పరంగా చూస్తే బీఆర్ఎస్ నెంబర్ వన్ చెప్పక తప్పదు.
ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీకి రూ. 442.8 కోట్లు బాండ్ల రూపేణా పొందింది. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీకి రూ. 181.35 కోట్లు వచ్చాయని ఈసీ వెల్లడించింది. మొత్తంగా ఆయా పార్టీలు దాదాపు 1900 కోట్లు కొల్లగొట్టాయన్నమాట.