NEWSTELANGANA

ర‌జాక‌ర్ చిత్రాన్ని త‌ప్ప‌క చూడాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన బండి సంజ‌య్ కుమార్

కరీంన‌గ‌ర్ జిల్లా – ఆనాటి ర‌జాక‌ర్ హ‌యాంలో చోటు చేసుకున్న దురాగ‌తాలు, దారుణాల‌ను, దౌర్జ‌న్యాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు ర‌జాక‌ర్ సినిమాతో. ప్ర‌స్తుతం ఈ చిత్రం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ప్ర‌తి ఒక్క‌రు దీనిని ఆద‌రిస్తున్నారు.

తాజాగా క‌రీంన‌గ‌ర్ లో రజాక‌ర్ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యాన్ని తెలుసుకున్నారు బీజేపీ మాజీ చీఫ్ , క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. ఈ సంద‌ర్బంగా చిత్ర యూనిట్ తో పాటు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి సినిమా వీక్షించారు.

నిజాం పాల‌న‌లో తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయం, దురాగ‌తాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడంటూ కితాబు ఇచ్చారు ఎంపీ. ప్ర‌తి ఒక్క‌రూ ఈ ముఖ్య‌మైన చిత్రాన్ని చూసి తీరాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్బంగా ఎంతో ధైర్యంతో ర‌జాక‌ర్ సినిమా తీసినందుకు యూనిట్ ను అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.