NEWSNATIONAL

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర‌

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే

న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే నిప్పులు చెరిగారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ , దాని అనుబంధ సంస్థ‌లు భారీ ఎత్తున కుట్రకు తెర లేపారంటూ ఆరోపించారు. సోమ‌వారం ఖ‌ర్గే రాహుల్ గాంధీతో క‌లిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావ జాలం భార‌త రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నం చేశారంటూ మండిప‌డ్డారు.

పేద‌ల హ‌క్కుల‌ను హ‌రించి త‌న బిలియ‌నీర్ స్నేహితుల‌కు ల‌బ్ది చేకూర్చేందుకు ప్ర‌ధాన మంత్రి మోదీ ప్ర‌య‌త్నం చేస్తున్నాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. త‌న మ‌నువాది ఆలోచ‌న‌ల‌ను అన్యించ‌డం ద్వారా మ‌నుషుల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించేలా చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని ర‌ద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ మండిప‌డ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదీవాసీల హ‌క్కుల‌ను హ‌రించేందుకు ప్లాన్ చేశారంటూ మండిప‌డ్డారు.

ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ద్వేషం, హింస, విభజన ఆలోచనా శక్తుల మధ్య జరుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.