NEWSTELANGANA

ప్ర‌భుత్వం ప‌డిపోతే ప‌ట్టుకోలేం

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ వార్నింగ్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. కాంగ్రెస్ , బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా మొన్న‌టికి మొన్న బీజేపీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ స‌ర్కార్ ఎక్కువ కాలం ఉండ‌ద‌న్నారు.

ఆయ‌న బాట‌లోనే మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ బీజేపీ చీఫ్ , ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జ‌గిత్యాల‌లో జ‌రిగిన బీజేపీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సాక్షిగా ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత ఉండ‌ద‌న్నారు. తెలంగాణ‌లో క‌చ్చితంగా డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ ఏర్పాటు చేస్తామ‌ని జోష్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని ప‌డి పోతుంటే తాము కాపాడ లేమ‌ని హెచ్చ‌రించారు.

సీఎం గేట్లు తెరిచామ‌ని ప‌దే ప‌దే ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నార‌ని, ముందు త‌న పార్టీకి చెందిన వారు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా చూసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.