కాంగ్రెస్ జెండా ఎగరాలి
దామోదర రాజ నరసింహ
సంగారెడ్డి – సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచించడం ప్రారంభించింది.
ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లాపై మంచి పట్టుంది మంత్రి రాజ నరసింహకు. ఆయన ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపు పట్టాలపై తీసుకు వచ్చేందుకు కంకణం కట్టుకున్నారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ , జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, బాన్సావాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ , మాజీ మంత్రి చంద్రశేఖర్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు దామోదర రాజ నరసింహ. ఆరు నూరైనా సరే కాంగ్రెస్ జెండా ఎగరాలని స్పష్టం చేశారు మంత్రి.