వైసీపీ ఎంపీ రూ. 105 కోట్ల విరాళాలు
పలు పార్టీలకు ఇచ్చిన అయోధ్య రామిరెడ్డి
అమరావతి – సుప్రీంకోర్టు దెబ్బకు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం బట్ట బయలు అయ్యింది. దేశ వ్యాప్తంగా ఈ స్కాంపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. క్విడ్ ప్రో వ్యవహారం ఇందులో చోటు చేసుకుందని స్పష్టమైంది. దీనిపై సీరియస్ కామెంట్స్ చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ప్రసక్తి లేదని, పూర్తి వివరాలు చెల్లించాల్సిందేనని ఆదేశించారు.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. అయితే వీటిలో కేవలం కోట్లు మాత్రమే ఇచ్చినట్లు పేర్కొంది తప్పా ఎవరు ఇచ్చారనే దానిపై స్పష్టం చేయలేదు.
ఇదిలా ఉండగా వైసీపీకి చెందిన రాంకీ కంపెనీ చైర్మన్, ఎంపీ అయోధ్య రామి రెడ్డి ఏకంగా రూ. 105 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల పేరుతో ఆయా రాజకీయ పార్టీలకు విరాళాలను అందజేశారు. ఆయనకు చెందిన మరో కంపెనీ గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీటిని కొనుగోలు చేసినట్లు తేలింది. 2020లో వైఎస్సార్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది.