వ్లాదిమిర్ పుతిన్ కు మోదీ కంగ్రాట్స్
వరుసగా ఐదోసారి రష్యా ప్రెసిడెంట్
న్యూఢిల్లీ – రష్యా అధ్యక్షుడిగా వరుసగా ఐదోసారి ఎన్నికయ్యారు వ్లాదిమిర్ పుతిన్. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ పుతిన్ కు అభినందించారు.
రష్యా ఫెడరేషన్ చీఫ్ గా ఎన్నిక కావడం తనకు ఎంతగానో సంతోషం కలిగించిందని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా మంగళవారం స్పందించారు ప్రధానమంత్రి. ఈ సందర్బంగా ప్రశంసలు కురిపించారు. రష్యా, భారత దేశం రెండూ తర తరాల నుంచి కలిసి మెలిసి ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
వ్లాదిమిర్ పుతిన్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచంలో అత్యంత ఆత్మీయులలో తను కూడా ఒకరంటూ కితాబు ఇచ్చారు. తామిద్దరం కలిసి ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాయని, ఇందులో కీలకమైన పాత్ర పుతిన్ పోషిస్తున్నారంటూ కొనియాడారు.
రష్యా సంక్షోభం నుంచి గట్టెక్కించంలో వ్లాదిమిర్ పుతిన్ విశేషంగా కృషి చేస్తూ వచ్చారని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.