భద్రతా వైఫల్యం కూటమి ఆగ్రహం
పల్నాడు ఎస్పీపై ఈసీకి ఫిర్యాదు
అమరావతి – ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి. ఇది పూర్తిగా పల్నాడు ఎస్పీ బాధ్యతా రాహిత్యమేనని ఆరోపించింది.
కూటమి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడి ప్రాంతంలో కూటమి ఆధ్వర్యంలో ప్రజాగళం పేరుతో సభ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఈ సభలో మోదీ ప్రసంగిస్తుండగా పవర్ కట్ అయింది.
అంతే కాకుండా సభకు బ్లాంక్ పాసులు జారీ చేశారని ఆరోపించారు కూటమి నేత నాదెండ్ల మనోహర్. దీంతో భద్రతా వైఫల్యం జరిగినట్లు పూర్తిగా తేలి పోయిందని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందుకు ప్రధాన కారణం పల్నాడు జిల్లా ఎస్పీ అంటూ ఆరోపించారు.
సభకు సంబంధించి ముందుగానే ఎస్పీ రవిశంకర్ రెడ్డికి సమాచారం అందించామని స్పష్టం చేశారు. ఈ నెల 12నే లేఖ రాశామని పేర్కొన్నారు. కానీ సభలో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించలేదని మండిపడ్డారు. సభను భగ్నం చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ కార్యకర్త లాగా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వ్యవహరించారని ధ్వజమెత్తారు.
పవర్ కట్ అయిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు నాదెండ్ల మనోహర్. నలుగురు పోలీసు అధికారులపై ఆధారాలు అందజేశామని పేర్కొన్నారు.