NEWSTELANGANA

ఆర్ఎస్పీ ప‌చ్చి అవ‌కాశవాది

Share it with your family & friends

డీఎస్పీ చీఫ్ విశార‌ద‌న్ మ‌హారాజ్

హైద‌రాబాద్ – ధ‌ర్మ స‌మాజ్ పార్టీ చీఫ్ విశార‌ద‌న్ మ‌హారాజ్ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. దేశం అంతా దుమ్మెత్తి పోసినా ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టేందుకు దొర గ‌డీలోకి చేరారో ఆర్ఎస్పీ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

విశార‌ద‌న్ మ‌హారాజ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. నిన్న‌టి దాకా అంబేద్క‌ర్ , పూలే, కాన్షీరాంల పేరు చెప్పి, నీతి సూత్రాలు వ‌ల్లిస్తూ వ‌చ్చిన ఆర్ఎస్పీ ఉన్న‌ట్టుండి బీఆర్ఎస్ లో చేర‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన నిర్వాకాలు ఎన్నో ఉన్నాయ‌ని ఆరోపించారు. ఆర్ఎస్పీ తెలంగాణ వాదాన్ని, బ‌హుజ‌న వాదాన్ని దొర కాళ్ల ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు విశార‌ద‌న్ మ‌హారాజ్.

తాము ముందు నుంచి చెబుతూనే వ‌చ్చామ‌ని, బ‌హుజ‌న ముసుగు క‌ప్పుకున్నాడంటూ కానీ జ‌నం న‌మ్మ లేద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ గ‌ర్భం నుంచి ప్ర‌స‌వించిన ప్ర‌వీణ్ కుమార్ అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు డీఎస్పీ చీఫ్‌.