newsseals.com
ENTERTAINMENT

సినిమా అంటే వినోదం కాదు ప్ర‌జా ఉద్య‌మం

VijayaBhaskar May 3, 2026
newsseals-Dasoju
Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మించిన “జై బోలో తెలంగాణ” సినిమాలో తాను ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ జితేంద్రగా నటించిన ఆ రోజులు నేను జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు అని గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా సినిమాకు సంబంధించి ఫోటోల‌ను షేర్ చేశారు ఎక్స్ వేదిక‌గా . ఈ సినిమా వెండితెర మీద నడవలేదు.. ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఒక అగ్ని జ్వాల రగిల్చిందన్నారు.

ఈ ఫోటో చూస్తుంటే.. అటు సినిమా, ఇటు నిజం రెండు కలిసినట్టు అనిపిస్తుందని అభిప్రాయ‌ప‌డ్డారు. టీజేఏసీ నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, వేదకుమార్ ,!రచయిత జూలూరి గౌరీశంకర్ , అల్లం నారాయణ .. వీళ్లందరి మధ్య ఆనాడు ఆ లాఠీఛార్జ్ సీన్లలో నటిస్తుంటే, అది నటనలా అనిపించలేదు. మన ప్రజల ఆవేదనను, ఆ పోరాట పటిమను కళ్లారా చూసినట్టు అనిపించింద‌ని తెలిపారు. ఉద్య‌మ నాయ‌కుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కేవలం ఉద్యమ స్ఫూర్తి ప్రధాత మాత్రమే కాదు.. ఆయన రాసిన “గారడి చేస్తుండ్రో.. గడబిడి చేస్తుండ్రో” అన్న పాట నాటి తెలంగాణ రాజకీయ కుట్రలను ఎంత సూటిగా ఎండగట్టిందో మనందరికీ తెలుసన్నారు.

గ‌ద్ద‌ర్ పాడిన పొడుస్తున్న పొద్దు మీద పాట తెలంగాణ మ‌లి ద‌శ ఉద్య‌మానికి ఊపిరి పోసింద‌న్నారు. తెలంగాణ చరిత్రను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించింద‌ని తెలిపారు. త‌న స్నేహితుడు, ద‌ర్శ‌ఖుడు ఎన్. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తీరు సూప‌ర్ అని పేర్కొన్నారు.