మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉన్నా
బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
మల్కాజిగిరి – ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు కురిపిస్తున్న ఆదరాభిమానాలను మరిచి పోలేనని అన్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన విజయ సంకల్ప యాత్రలో బీజేపీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. అశేషమైన ప్రజానీకం సంపూర్ణ మద్దతు ఇస్తోందని అన్నారు.
లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు అత్యంత చైతన్యవంతమైన వారని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయత, వారి అభిమానం గురించి ఎంత చెప్పినా తక్కువేనని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. ఇందుకు సంబంధించి విజయ సంకల్ప రోడ్ షో అందుకు సాక్ష్యమని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రభావితం చేశారని తెలిపారు. స్వయంగా పీఎం ప్రజల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు ఈటల రాజేందర్. తెలంగాణ మూడ్ ఎలా ఉందో తెలుసు కోవాలని అనుకుంటే ముందు మల్కాజ్ గిరిని చూసి నేర్చు కోవాలని చెప్పారని అన్నారు.