తెలంగాణ ప్రజావాణి బంద్
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్ ) అమలు లోకి వచ్చిందని స్పష్టం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్. నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో ప్రజా వాణి నిర్వహిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలు మూలల నుంచి పెద్ద ఎత్తున బాధితులు వెల్లువలా వస్తున్నారు హైదరాబాద్ లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయం వద్దకు.
ఎన్నికల కోడ్ అమలు లోకి రావడంతో కోలుకోలేని షాక్ ఇచ్చింది సర్కార్. జూన్ 7వ తేదీ వరకు ప్రజా భవన్ లో ప్రజా వాణి నిర్వహించడం లేదని , ఈ విషయాన్ని ప్రజలు, బాధితులు గమనించాలని కోరింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి 2024 ప్రకారం ప్రజావాణిని వాయిదా వేస్తున్నట్లు నోడల్ అధికారి వెల్లడించారు. సీఎస్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.