NEWSTELANGANA

భ‌ట్టిపై భ‌గ్గుమ‌న్న జ‌డ్స‌న్

Share it with your family & friends

డిప్యూటీ సీఎంకు సిగ్గులేదు

హైద‌రాబాద్ – కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు బ‌క్క జ‌డ్స‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న గ‌త కొంత కాలం నుంచీ ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తూ వ‌స్తున్నారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన అక్ర‌మాల‌పై , అవినీతికి పాల్ప‌డిన ఉన్న‌తాధికారుల‌పై ఫిర్యాదు చేశారు. ప్ర‌తి క్ష‌ణం ప్ర‌జా ప‌క్షం వ‌హిస్తూ చ‌ర్చ‌నీయాంశంగా మారారు. తాజాగా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ద‌ళిత జాతి ఆత్మ గౌర‌వానికి భంగం క‌లిగిస్తున్నా ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆరోపించారు.

యాదగిరిగుట్ట ఆల‌యంలో కావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కింద కూర్చోబెట్టినా తానే కూర్చున్నానంటూ చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు బ‌క్క జ‌డ్స‌న్. ద‌ళితుల ఆత్మ గౌర‌వాన్ని దెబ్బ తీస్తున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భ‌ట్టి త‌మ నాయ‌కుడు అయినందు వ‌ల్ల తాను ఊరుకున్నాన‌ని లేక పోతే సీఎంపై అట్రాసిటీ కేసు పెట్టే వాడిన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పేప‌ర్ల‌లో వ‌స్తున్న యాడ్స్ ల‌లో త‌న ఫోటో ఒక్క‌టే సీఎం వేసుకున్నాడ‌ని ఆరోపించారు. నామినేటెడ్ ప‌ద‌వుల‌లో ఒక్క ద‌ళితుడికి ఇప్పించిన దాఖ‌లాలు లేవంటూ భ‌ట్టిపై భ‌గ్గుమ‌న్నారు.