NEWSTELANGANA

క‌విత‌క్కా నీకు జైలు ప‌క్కా – సుఖేష్

Share it with your family & friends

చంద్ర‌శేఖ‌ర్ లేఖ క‌ల‌క‌లం

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు అన్ని దారులు మూసుకు పోతున్న‌ట్లు అనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ కీల‌క‌మైన ఆధారాలు దొరికిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు సుదీర్ఘ‌మైన లేఖ విడుద‌ల చేసింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కీల‌క‌మైన పాత్ర పోషించింది క‌వితేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఇరుక్కుని తీహార్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ మంగ‌ళ‌వారం సుదీర్ఘ లేఖ రాశారు.

క‌విత‌క్కా నీకు తీహార్ జైలు ప‌లుకుతోంద‌ని, నీతో పాటు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు ప్ర‌త్యేకంగా గ‌ది సిద్దంగా ఉందంటూ పేర్కొన్నారు. ఏరోజుకైనా త‌న‌ను ఇబ్బంది పెట్టిన మీ ఇద్ద‌రు ఇక్క‌డికి రావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాచుకున్న వేల కోట్ల రూపాయ‌ల‌ను సింగ‌పూర్, జ‌ర్మ‌నీ, ఇత‌ర దేశాల్లో దాచుకున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ప్ర‌స్తుతం సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ రాసిన లేఖ క‌ల‌క‌లం రేపుతోంది. ఇదే స‌మ‌యంలో గ‌తంలో తాను చేసిన అరోప‌ణ‌ల‌న్నీ వాస్త‌వ‌మ‌ని ఈడీ విచార‌ణ‌లో తేలి పోయింద‌ని తెలిపారు .