NEWSTELANGANA

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ గా రాధాకృష్ణ‌న్

Share it with your family & friends

ఇన్ ఛార్జ్ బాధ్య‌త‌లు జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ కు

హైద‌రాబాద్ – జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణ‌న్ కు తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ కేంద్ర స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా కూడా సీపీ రాధాకృష్ణ‌న్ ను నియ‌మించింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌, పుదుచ్చేరీల‌కు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌మిళ‌నాడుకు చెందిన త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ రాజీనామా చేశారు.

త‌న రాజీనామా లేఖ‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు అంద‌జేశారు. ఈ మేర‌కు ఆమె రాజీనామాను ఆమోదిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్. ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో బీఆర్ఎస్ స‌ర్కార్ హ‌యాంలో గ‌వ‌ర్న‌ర్ కీల‌కంగా మారారు. ఆమె దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. కానీ ఎన్నిక‌ల వేళ ఉన్న‌ట్టుండి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డం విస్తు పోయేలా చేసింది.

మొత్తంగా త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.