వైసీపీకి షాక్ ఎమ్మెల్యే ఆర్థర్ జంప్
పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ షర్మిల
కర్నూలు జిల్లా – అధికారంలో ఉన్న వైసీపీకి కోలుకోలేని షాక్ లు తగులుతున్నాయి. రోజుకొకరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే లిస్టు ప్రకటించినా మరికొందరు తమకు ఆశించిన ప్రాంతాలలో టికెట్లు దొరక లేదంటూ మండిపడుతున్నారు.
ఇక కర్నూలు జిల్లాలో శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి నిర్వాకం కారణంగా తాను వేగలేక పోతున్నానంటూ బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేశారు. చివరకు జగన్ రెడ్డిని కలిసి చెప్పినా ఫలితం లేక పోయిందని వాపోయారు నందికోట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్.
దీంతో తాజాగా సదరు ఎమ్మెల్యే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. రాజకీయాలలో అపారమైన అనుభవం కలిగి ఉన్న ఆర్థర్ తమ పార్టీలో చేరడం మరింత బలాన్ని ఇస్తుందని ఈ సందర్బంగా అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నాయకుడని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి జనాదరణ పెరుగుతోందని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.