సీఏఏపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
మోదీ సర్కార్ భారీ ఊరటనిచ్చిన తీర్పు
న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉమ్మడి పౌర సత్వ చట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సీఏఏను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
దీనిని సవాల్ చేస్తూ సీఏఏను అమలు చేయొద్దంటూ స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. పలు పిటిషన్లపై మంగళవారం భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది.
ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. ముస్లింలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. స్టే ఇచ్చేందుకు కుదరదని స్పష్టం చేసింది ధర్మాసనం. ముస్లింలు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరింది. దీనిని తోసి పుచ్చింది కోర్టు.