ఎస్బీఐపై సీజేఐ కన్నెర్ర
ఎలక్టోరల్ బాండ్ల వివరాలేవీ
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు. సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతాపార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తీసుకు వచ్చింది. అధికారికంగా నిలువు దోపిడీకి కేరాఫ్ గా మారింది. ఈ దేశానికి చెందిన వారు ఎవరైనా , ఏ సంస్థలైనా తమకు తోచినంత మేర విరాళాలను ఆయా రాజకీయ పార్టీలకు ఇచ్చేలా తీర్చిదిద్దారు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దీనికి సూత్రధారిగా ఉన్నారు.
విచిత్రం ఏమిటంటే ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి వివరాలు ఏవీ ఇప్పటి వరకు బయటకు రాలేదు . దీంతో ఎవరెవరు, ఏయే సంస్థలు ఏయే పార్టీలకు ఎన్నెన్ని విరాళాలు అందించాయనే విషయం నేటి దాకా తెలియదు. దీనిని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. చివరకు విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది. కేంద్రానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగానికి, దేశానికి విరుద్దమని కుండ బద్దలు కొట్టింది.
పూర్తి వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది. అయితే ఎస్బీఐ వివరాలు మాత్రమే ఇచ్చింది. కానీ ఎవరెవరు..ఏయే సంస్థలు ఏయే పార్టీలకు ఎన్ని కోట్లు ఇచ్చిందనే విషయాన్ని విస్మరించింది. దీనిపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. గురువారం లోగా పూర్తి వివరాలు ఇవ్వాలని లేక పోతే ఎస్బీ ఐ చైర్మన్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు.