NEWSTELANGANA

య‌శ‌స్విని రెడ్డి ప‌నితీరు సూప‌ర్

Share it with your family & friends

ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్

హైద‌రాబాద్ – ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ పాల‌కుర్తి శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన , యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ య‌శ‌స్విని రెడ్డిపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. ఆమె ప‌నితీరు అద్భుతంగా ఉంద‌న్నారు.

అంతులేని రీతిలో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డి, అరాచ‌కాల‌కు తెర తీసిన మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావును ఓడించి త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంద‌ని పేర్కొన్నారు కేఏ పాల్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇలాంటి యువ నాయ‌క‌త్వం తెలంగాణ రాష్ట్రానికి అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ దేశంలో మోదీ వ‌చ్చాక ప‌రిస్థితులు తారుమారు అయ్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈసారి జ‌ర‌గ‌బోయే పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో ఫ‌లితాలు రాబోతున్నాయ‌ని జోష్యం చెప్పారు. తాను విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి ఎంపీగా బ‌రిలో ఉంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి పాల‌న బాగుంద‌ని, ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. ఇక య‌శ‌స్విని రెడ్డి తాను ఇచ్చిన మాట ప్ర‌కారం ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్నార‌ని తెలిపారు.