NEWSTELANGANA

ర‌ఘునంద‌న్ రావు షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends

రంజిత్ రెడ్డి..జితేంద‌ర్ రెడ్డి పై ఫైర్

హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత‌, మెద‌క్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ నుంచి వెళ్లి పోయిన ఆముదాల‌పాడు జితేంద‌ర్ రెడ్డిపై , బీఆర్ఎస్ నుంచి జంప్ అయి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న రంజిత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోస‌మే వాళ్లు పార్టీ మారార‌ని ఆరోపించారు. ఇలాంటి వాళ్ల గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అయినా ఎవ‌రు ఎందు కోసం వెళుతున్నారో, ఎవ‌రిని ఎప్పుడు క‌లుస్తున్నారో చెప్ప‌లేని స్థితిలో ప్ర‌జ‌లు ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌తంలో విలువ‌లు అనేవి ఉండేవ‌ని, వాటికి నేత‌లు క‌ట్టుబ‌డి ఉండేవార‌ని, కానీ ఇవాళ ప‌ద‌వులే ప్రామాణికంగా మారాయ‌ని మండిప‌డ్డారు. దీని వ‌ల్ల ప్ర‌జాస్వామ్యానికి అత్యంత ప్ర‌మాదం ఏర్ప‌డ‌నుంద‌ని హెచ్చ‌రించారు.

ఇక పార్టీలు మారిన ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డిల బండారాన్ని బ‌య‌ట పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ఆర్థిక‌, కంపెనీల ప్ర‌యోజ‌నాలకు సంబంధించిన మొత్తం వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు ర‌ఘునంద‌న్ రావు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.