మోదీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫైర్
అమరావతి – కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసిన తర్వాత కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను బయట పెట్టింది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ. ఇదే సమయంలో గత మూడు రోజుల నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.
దీంతో దేశంలో అధికారంలో ఉన్న వారు ఎవరైనా అధికారిక కార్యక్రమాలకు హాజరు కాకూడదు. తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు వారికి ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు. ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది ఈసీ. ఇందుకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు స్పష్టంగా సూచించింది.
ఇదిలా ఉండగా ఏపీలోని చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ప్రజా గళం పేరుతో బహిరంగ సభ చేపట్టారు. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ కు చెందిన ఫ్లైట్ తో పాటు సిబ్బందిని ఉపయోగించుకున్నారంటూ మోదీపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేసింది పార్టీ.