దృష్టి సారిస్తే గెలుపు పక్కా
ప్రముఖ ట్రైనర్ తను జైన్
బీహార్ – ప్రముఖ ట్రైనర్ , మాజీ ఐఏఎస్ అధికారిణి తను జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె గత కొన్నేళ్లుగా ఈ దేశంలో సేవలు అందించేందుకు గాను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారికి అండగా నిలుస్తూ వస్తోంది. వందలాది మందిని ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐసీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. తాజాగా బీహార్ లోని పాట్నాకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ప్రసిద్దమైన ప్రాంతం గయా వేదికగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు తను జైన్. ఎన్ఐటీ ఘాట్ లో బహిరంగంగా నిర్వహించిన ఈ వేదిక లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. వేలాది మంది విద్యార్థీనీ విద్యార్థులు హాజరయ్యారు.
విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు తను జైన్. జీవితంలో ఎదగాలంటే, గుర్తింపు పొందాలంటే డబ్బు అనేది ప్రధానం కాదని స్పష్టం చేశారు. చదువు ఒక్కటే మనల్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టేలా చేస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరు తమ గోల్ ను ఏర్పాటు చేసుకోవాలని, ఆ దిశగా ప్రయత్నం చేస్తే అనుకున్నది సాధించ వచ్చని స్పష్టం చేశారు తను జైన్.
ఫోకస్ పెడితే సక్సెస్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్నారు.