రాయబరేలిలో పోటీకి రెఢీ
స్పష్టం చేసిన నూపుర్ శర్మ
న్యూఢిల్లీ – ఊహించని రీతిలో రాజకీయాలు నెరపడంలో బీజేపీ తర్వాతే ఎవరైనా. పేరుకు జేపీ నడ్డా పార్టీ చీఫ్ గా ఉన్నా మొత్తం తెర వెనుక నడిపించేదంతా కేంద్ర హోం శాఖ మంత్రినేనని చెప్పక తప్పదు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక దేశమంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చేసింది.
దీంతో అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే విషయంపై ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి లోక్ సభ స్థానంలో అనూహ్యంగా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది.
ఆమె ఎవరో కాదు వివాదాస్పద నాయకురాలిగా గుర్తింపు పొందిన నూపుర్ శర్మ. ఆమె కారణంగా దేశంలో పలు చోట్ల హిందూ, ముస్లింల మధ్య విభేదాలు పొడచూపాయి. కోర్టు కూడా సీరియస్ అయ్యింది. కొన్ని రోజుల పాటు అండర్ గ్రౌడ్ కు వెళ్లింది. ఆమె అల్లా గురించి చులకనగా మాట్లాడిందంటూ ఆరోపణలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో నూపుర్ శర్మను ఎంపీగా బరిలోకి దించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడ 20 ఏళ్ల పాటు సోనియా గాంధీ ఎంపీగా గెలుస్తూ వచ్చారు.