NEWSNATIONAL

అంద‌రి క‌ళ్లు ప్రియాంక పైనే

Share it with your family & friends

రాయ‌బ‌రేలిలో బ‌రిలో ఉండే ఛాన్స్

న్యూఢిల్లీ – సార్వ‌త్రిక ఎన్నిక‌లు ప్ర‌స్తుతం జ‌రుగుతుండ‌డంతో అంద‌రి క‌ళ్లు ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీపై ఉన్నాయి. దీనికి కార‌ణం ఆమె ఈసారి ఎక్క‌డి నుంచి బ‌రిలోకి దిగుతుంద‌నే దానిపై చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో.

ప్ర‌స్తుతం త‌న త‌ల్లి , సీపీపీ చైర్ ప‌ర్స‌న్ , ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీకి వ‌య‌సు భారం ప‌డ‌డంతో ఈసారి పార్టీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు తెర దించాల‌ని విన్న‌వించింది. ఈ మేర‌కు త‌న‌యుడు రాహుల్ గాంధీ ఓ వైపు బ‌ల‌మైన బీజేపీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను , ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా తో ఢీకొంటున్నారు.

ఇదే స‌మ‌యంలో పార్టీ తీవ్ర‌మైన ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో ఆక్సిజ‌న్ లాగా మారారు రాహుల్ గాంధీ, త‌న సోద‌రి ప్రియాంక గాంధీ, త‌ల్లి సోనియాతో క‌లిసి భార‌త్ జోడో యాత్రకు శ్రీ‌కారం చుట్టారు. ఈ ప్లాన్ స‌క్సెస్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో గ‌తంలో కంటే ఈసారి అత్య‌ధికంగా సీట్లు పొందాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఈసారి యూపీలోని అమేథి నుంచి తిరిగి బ‌రిలో ఉంటార‌ని రాహుల్ గాందీ గురించి భావించారు. కానీ పార్టీ అనూహ్యంగా ఆయ‌న మ‌రోసారి వాయ‌నాడు నుంచే పోటీ చేస్తార‌ని తెలిపింది. ఇదే స‌మ‌యంలో సోనియాకు బ‌దులు కూతురు ప్రియాంక గాంధీ రాయ‌బ‌రేలిలో ఉండ‌నుంది. ఆమెకు పోటీగా వివాదాస్ప‌ద నాయ‌కురాలు నూపుర్ శ‌ర్మను దించాల‌ని బీజేపీ ప్లాన్ చేస్తోంది.