సుదర్శన హోమంలో దామోదర
వెంకటేశ్వర ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ట
మెదక్ జిల్లా – రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ట ను పురస్కరించుకుని సుదర్శన హోమాన్ని చేపట్టారు.
ఈ సందర్బంగా మంత్రి సుదర్శన హోమంతో పాటు విశేష పూజలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ మంత్రికి సాదర స్వాగతం పలికింది. ఇక పూజారులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడారు.
ఈ గ్రామానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతో మహిమ కలిగిన ఆలయంగా ఇది గుర్తింపు పొందిందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, రాష్ట్రం బాగుండాలని ఆ స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు దామోదర రాజ నరసింహ.
కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని, కోరిన కోర్కెలు నెరవేరుస్తాడన్న నమ్మకం ఇక్కడి భక్తులకు ఉంది. మొత్తంఆ ఆలయంలో పూజలు చేయడంతో ఆ ప్రాంగణమంతా కళ కళలాడింది భక్త బాంధవులతో.