NEWSNATIONAL

2047 కోసం ప్లాన్ చేస్తున్నా – మోదీ

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ప్ర‌ధానమంత్రి
న్యూఢిల్లీ – భార‌త దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో మ‌రింత దూకుడు పెంచారు. ఏకంగా ప్ర‌తిప‌క్షాల‌ను , ఇండియా కూట‌మిని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

దేశ వ్యాప్తంగా మోదీ హ‌వా కొన‌సాగించేలా ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ చంద్ర షా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఎన్ క్లేవ్ పేరుతో నిర్వ‌హించిన చ‌ర్చా గోష్టిలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పాల్గొన్నారు. ప‌లువురు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

ఇందులో భాగంగా 2024 గురించి ఏం ఆలోచిస్తున్నార‌న్న ప్ర‌శ్న‌కు ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు. తాను నేటి ఏడాది గురించి ప‌ట్టించు కోవ‌డం లేద‌న్నారు. రాబోయే 2047 కోసం ప్లాన్ చేయ‌డంపై ఫోక‌స్ పెట్టాన‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.