కాంగ్రెస్ సర్కార్ పై ఆర్ఎస్పీ ఫైర్
అప్పులపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన వస్తూనే సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన సర్కార్ ను ఏకి పారేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు.
తాను ఎలాంటి ప్యాకేజీ తీసుకోకుండా స్వచ్చంధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. తాను ఒకడి కింద గులాంగిరీ చేసే మనస్తత్వం కాదన్నారు. తాను కష్టపడి పోలీస్ ఆఫీసర్ అయ్యానని, 10 వేల మంది విద్యార్థుల బతుకుల్లో వెలుగులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశానని అన్నారు. తనను విమర్శించే వారికి ఒక్కటే సమాధానం చెప్పదల్చుకున్నానని అన్నారు.
తాను నిఖార్సయిన బహుజన వాదాన్ని నమ్మే తెలంగాణ బిడ్డను అని ప్రకటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ సర్కార్ రూ. 6.71 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారని , మరి తాను వచ్చిన 105 రోజుల్లో ఎన్ని అప్పులు తీసుకు వచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్పీ.
ముందుకు తీసుకు వచ్చిన రూ. 16,400 కోట్లకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు.