NEWSANDHRA PRADESH

ఎన్ని కోట్లు పంచినా గెలుపు నాదే

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్

పిఠాపురం – ఏపీలో ఎన్నిక‌ల న‌గారా మోగింది. దీంతో రాజ‌కీయ ప‌రంగా మ‌రింత వేడి నెల‌కొంది. జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ కూట‌మి దూకుడు పెంచింది. ఈ సంద‌ర్బంగా అధికార పార్టీకి చెందిన కొంద‌రు జ‌న‌సేన పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌సంగించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

పిఠాపురంలో ఓటుకు ల‌క్ష రూపాయ‌లు పంపిణీ చేసినా చివ‌ర‌కు ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలిచేది తానేన‌నంటూ ధీమా వ్య‌క్తం చేశారు. దేశంలోనే మోడ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా తాను విజ‌యం సాధించాక అభివృద్ది చేస్తానంటూ చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

విద్య‌, వైద్యం, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు ఫోక‌స్ పెడ‌తాన‌ని పేర్కొన్నారు. వంగా గీత‌, ద‌ల‌మ‌ల శెట్టి సునీల్ స‌మీప భ‌విష్య‌త్తులో జ‌న‌సేన పార్టీలోకి రావాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పారు జ‌న‌సేన పార్టీ చీఫ్.

త‌మ పార్టీకి చెందిన అభ్య‌ర్థులు పోటీ చేసిన ప్ర‌తీచోటా గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.