మోదీకి సద్గురు థ్యాంక్స్
ఆరోగ్యం పదిలంగానే ఉంది
న్యూఢిల్లీ – ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవన్ తీవ్ర అనారోగ్యంతో న్యూఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఉన్నట్టుండి మెదడలో రక్త స్రావం జరగడంతో శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది భక్తులను కలిగి ఉన్నారు జగ్గీ వాసుదేవన్. ఆయన శివుడికి భక్తుడు. ప్రతి ఏటా శివరాత్రి రోజు తమిళనాడు లోని కోయంబత్తూరులో ఘనంగా శివ రాత్రిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇదే సమయంలో ఆయన అనుకోకుండా అనారోగ్యానికి గురి కావడం, సర్జరీ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ దేశానికి సద్గురు అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించారు జగ్గీ వాసుదేవన్ . ప్రధాన మంత్రి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన ఆరోగ్యం పట్ల కనబర్చిన ఆందోళన తనను ఆనందానికి గురి చేసిందన్నారు. మోదీజీ మీరు ఈ దేశానికి చాలా అవసర\మని పేర్కొన్నారు.